Home / ANDHRAPRADESH / నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ ఆయన మీద పడేది. కాగా, టీడీపీ నిరసన కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఆపరేటింగ్ లోపం కారణంగా ఆ డ్రోన్ విద్యుత్ వైర్లకు తగిలి కింద పడిపోయిందని భద్రతా సిబ్బంది తెలిపారు.