ఎవరూ ఊహించని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవికి మైదుకూరు ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ ఛైర్మన్‌గా ఎంపికైన సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర మైదుకూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. కడప జిల్లాలో పూర్తిగా వెనుకబడిపోయిన మైదుకూరును అద్భుతరీతిలో అభివృద్ధి చేస్తున్నాను..నేను పదవుల కోసం రాజకీయాల్లోని రాలేదు..ప్రజా సేవకే వచ్చానంటూ సుధాకర్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. రాజోలి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. వరల్డ్ ఫేమస్ టీటీడీ ఛైర్మన్ పదవి వస్తుందని పేపర్లోనే చూశా..అసలు టీటీడీ డైరెక్టర్ని కూడా అవుతానని అనుకోలేదు..కానీ చంద్ర బాబుగారు ఏకంగా టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ఊహించలేదని సుధాకర్ అన్నారు. బాబుగారు ఏ బాధ్యతలు అప్పగించినా చేపడతానని. .మైదుకూరును ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తున్నానని సుధాకర్ యాదవ్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కొన్ని రూమర్స్ వస్తున్నాయి.. ప్రత్యర్థులు కావాలని మైండ్‌గేమ్ ఆడుతారు..ఎవరూ నమ్మద్దు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మైదుకూరు టికెట్ నాకే వస్తుంది..నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా మీరెవరు భయపడకండి అంటూ సుధాకర్ యాదవ్ కార్యకర్తలకు స్పష్టం చేశారు.
టీటీడీ ఛైర్మన్ పదవి వచ్చిన ఉత్సాహంలో వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుధాకర్ యాదవ్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి డీఎల్‌ను పార్టీలోకి రప్పించి మైదుకూరు నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నాడని సమాచారం…దీంతో పుట్టా సుధాకర్ యాదవ్ స్పీడు పెంచుతున్నాడు..ఎలాగైనా డీఎల్‌ను పార్టీలోని రానివ్వకుండా పావులు కదుపుతున్నాడు. వచ్చే ఎన్పికల్లో మైదుకూరు టికెట్‌ను దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు..మరి మైదుకూరు నుంచి పోటీ చేయాలన్న ఈ టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ ప్రయత్నాలు ఫలిస్తాయా..లేదా డీఎల్ టీడీపీ నుంచి పోటీ చేస్తాడా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.