ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ పెండ్లి అనంతపురం జిల్లా, వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు, పరిటాల అభిమానులు హాజరైన ఈ పెండ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు..అలాగే పలువురు టీడీపీ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే టీడీపీ జాతీయ కార్యదర్శి, సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి లోకేష్ బాబు మాత్రం పెండ్లికి రాలేదు..లోకేష్ బిజీగా ఉన్నారు కాబట్టే చంద్రబాబు ఒక్కరే పెండ్లికి హాజరయ్యాని టీడీపీ శ్రేణులు పైకి అంటున్నా అసలు కారణం వేరే ఉందని సమాచారం. టీడీపీలో సీనియర్లు అయిన పరిటాల ఫ్యామిలీకి , లోకేష్‌కు అస్సలు పొసగదని భోగట్టా. లోకేష్ పార్టీలో జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తూ , యనమల, అచ్చెన్నాయుడు లాంటి సీనియర్లను పక్కనపెడుతున్న సంగతి తెల్సిందే..అలాగే పరిటాల సునీత పట్ల కూడా లోకేష్ సానుకూలంగా లేడంట.
దీనికి కారణం పరిటాల సునీత వర్గానికి, ప్రకాశం జిల్లాలో కరణం బలరాం వర్గానికి సన్నిహిత సంబంధాలే కారణం.
ప్రకాశం జిల్లా ఇన్‌చార్జిగా సునీత వ్యవహరిస్తున్నారు..ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకుడు కరణం బలరాంకు, వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గానికి తీవ్ర స్థాయిలో విబేధాలు ఉన్నాయి. అయితే లోకేష్ గొట్టిపాటి వర్గానికే మద్దతు పలుకుతూ కరణం బలరాంకు జిల్లాలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాడని ప్రకాశం జిల్లా క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా జిల్లా ఇన్‌చార్జి అయిన పరిటాల సునీత కరణం బలరాం వర్గాన్ని వెనకేసుకుని రావడం పట్ల లోకేష్ ఆగ్రహంగా ఉన్నాడంట..ఆ కోపంతోనే పరిటాల శ్రీరామ్ పెండ్లికి రాలేదని టీడీపీలో చర్చ జరుగుతుంది. కేవలం వ్యక్తిగత బేధాప్రియాలతో ఇలా సాటి కేబినెట్ మంత్రి కుమారుడు, పార్టీ యువనేత పెండ్లకి హాజరుకాకపోవడం లోకేష్‌కు విజ్ఞత అనిపించుకోదని పార్టీ నాయకులు అంటున్నారు. పరిటాల వర్గానికి లోకేష్‌కు పడట్లేదని, అందుకే పెండ్లికి రాకుండా ఎగ్గొట్టాడని శ్రీరామ్ పెండ్లి సాక్షిగా తేలిపోయినట్లయింది..