ఆడవారికి భద్రత చేకూరాలంటే బాబు రావాల్సిందే అని గత ఎన్నికల్లో ఆడవారి చెవులు తూట్లు పడేలా ప్రచారం చేయించాడు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏపీలో మహిళలకు భద్రత చేకూరాలంటే బాబు పోవాల్సిందే అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీలో రోజురోజుకీ ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా రౌడీయిజానికి పెట్టిన పేరైనా రాజధాని నగరం విజయవాడలో ఆడవారికి రక్షణ కరువైంది ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు ఇంటికి వచ్చే దాకా భయమే. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సిందోనని మహిళల కుటుంబ సభ్యులు భయపడే పరిస్థితి నెలకొందంటే ఆశ్చర్యం కాదు. ఇంట్లో ఉన్నా సరే ఎప్పుడు ఏ కాల్‌మనీ కామాంధులు కాటేస్తారో అని ఆడవారు వణికిపోవాల్సిన దుస్థితి. తాజాగా ఓ మహిళా ఆడ్వకేట్‌పై రౌడీ షీటర్లు దాడి చేశారు. కొత్త పేటలోని బంకా రామరాజు వీధిలో మహిళా అడ్వకేట్ వెంకటరమణి నివాసముంటున్నారు. ఆమె ఈరోజు ఒంటరిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడిన ఇద్దరు రౌడీ షీటర్లు ఆమెపై భౌతిక దాడికి దిగారు. ఒక్కసారిగా పిడిగుద్దులు కురిపించడంతో వెంకరమణి గట్టికా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆమె ఇంటికి చేరుకున్నారు..దీంతో ఆ రౌడీ షీటర్ శివతో పాటు మరో వ్యక్తి వెంటనే అక్కడనుంచి పరారీ అయ్యారు. రౌడీ షీటర్ల దాడిలో గాయపడిన వెంకటరమణి ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఆమె ఫిర్యాదు మేరకు సదరు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలను విచారిస్తున్నారు..మహిళా అడ్వకేట్‌పై దాడిని బెజవాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఏపీలో ఆడవారికి భద్రత కలగాలంటే బాబు పోవాల్సిందే అని బెజవాడ ప్రజలు అంటున్నారు.
