అన్న వస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడు..అంటూ ప్రతి అక్కా, చెల్లెమ్మకు, అవ్వాతాతలకు, గ్రామాలకు వెళ్లి చెప్పండి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనం రేకెత్తించింది. జగన్ నవరత్నాల పథకాలపై ఏపీ అంతటా ప్రజల్లో సానుకూలత వ్యక్తం అయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే చంద్రబాబులాగా కాకుండా విశ్వసనీయతకు మారుపేరైనా వైఎస్ వారసుడిగా జగన్ ఆ నవరత్నాల్లాంటి 9 పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాడని ఏపీ ప్రజలు భావించారు నవరత్నాల ప్రకంపనలకు టీడీపీ కంగారు పడిపోయింది. అయితే ఇంతలో నంద్యాల, కాకినాడలో వందల కోట్లు వెదజల్లి ఓటుకు 10 వేలు వెదజల్లి టీడీపీ గెలవడంతో వైసీపీ ఖంగుతింది. ఒక రకంగా నంద్యాల, కాకినాడ ఎన్నికలు వైసీపీ శ్రేణులను నిస్తేజానికి గురిచేశాయనే చెప్పాలి..దీంతో నవరత్నాలకు రావాల్సింత అప్లాజ్ కూడా రాలేదు అయితే అధ్యక్షుడు జగన్ మాత్రం పట్టుదలతో పార్టీ క్యాడర్లో నిస్తేజాన్ని తొలగించి ఉత్తేజం కలిగించేదిశగా పాదయాత్ర కార్యక్రమం చేపట్టబోతున్నాడు..ఈలోగా ప్రత్యేకహోదాపై యువభేరీలు నిర్వహిస్తూ పోరాటం సాగిస్తూనే ఉన్నాడు.. కాగా అన్నవస్తున్నాడు అంటూ జగన్ ఇచ్చిన నినాదం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది..తాజాగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ మరో కొత్త నినాదం ఎత్తుకోబోతున్నాడు..ఇప్పటి వరకు జగన్ ఇచ్చిన నినాదాలపై, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా వక్రీకరించి ఆయన్ని బద్నాం చేయడంలో విజయవంతం అయ్యాయి. కానీ జగన్ ఎత్తుకోబోయే సరికొత్త నినాదం ఎటువంటి
వివాదాలకు దారితీయని విధంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు వైఫల్యాలపై, వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్ ఇక నుంచి ప్రజల్లోకి పాజిటివ్‌గా వెళ్లబోతున్నట్లు సమాచారం..ఒక పక్క చంద్రబాబు ఫెయిల్యూర్స్‌పై నిర్మాణాత్మక విమర్శలు చేస్తూనే మరో పక్క నాకు ఒక్క అవకాశం ఇవ్వండి..ఆశీర్వదించండి.. అంటూ పాదయాత్ర నుంచి జగన్ నినదించబోతున్నాడు..నాకు అవకాశం ఇవ్వండి..మీ రాజన్న బిడ్డను ఆశీర్వదించండి అంటూ జగన్ సవినయంగా అభ్యర్థించడం ప్రజల్లో వైసీపీ పట్ల సానుకూలత ఏర్పరుస్తుందని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారంట..ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఇెక నుంచి నెగెటివ్ ప్రచారం కంటే పాజిటివ్ వేలో ప్రజలను కన్విన్స్ చేస్తే చాలని..వైసీపీ అధిష్టానం భావిస్తుంది..ఒక్కసారి జగన్ ప్రజల్లోకి వెళ్లి నాకు ఒక్క సారి అవకాశం ఇవ్వండి..ఆశీర్వదించండి అని నినదిస్తే ప్రజల్లో ఆలోచన రేకెత్తించడం ఖాయం అని తెలుగు తమ్ముళ్లు కూడా అభిప్రాయపడుతున్నారంట..మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఎత్తుకుంటున్న సరికొత్త నినాదం టీడీపీ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
