ఎవరైనా నాయకుడు ఎన్నికల్లో ఓడిపోతే కారణాలు ఏముంటాయి.. సదరు నాయకుడిపై ప్రజల్లో విశ్వాసం కలుగక పోవడం, అసమర్థత, అవినీతి ఆరోపణలు..ఇవే ఆ నాయకుడి ఓటమికి కారణం అవుతాయి. కానీ తన ఓటమికి మీరే కారకులు అని కార్యకర్తలపై విరుచుకుపడుతున్నాడు..ఓ టీడీపీ సీనియర్ నాయకుడు..ఇంతకీ ఎవరంటారా..ఆయనే చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు..పార్టీలు మార్చినంత అవలీలగా మాటలు కూడా మార్చడంలో దిట్ట..సమయం, సందర్భం లేకుండా అస్తమానం ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై లక్ష కోట్లు, సిబిఐ కేసులు అంటూ గాలి కబుర్లు చెప్పి చంద్రబాబును ఇంప్రెస్ చేసి ఎమ్మెల్సీ పదవి కొట్టేశారు మన గాలి గారు. అయితే మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి గాలిని అల్లకల్లోలం చేస్తోంది. గత ఎన్నికల్లో ఆయన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రోజా చేతిలో స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. ఒకవేళ గెలిచి ఉంటే తాను కచ్చితంగా అప్పుడే మంత్రి అయి ఉండేవాడిని అని గాలి ఫీలింగ్..తాజాగా తన ఓటమికి కారణం మీరే అంటూ కార్యకర్లలపై గాలి చిందులు తొక్కారు. గురువారం పుత్తూరులో నగరి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంపై చర్చించిన గాలి ఇంటింటికి టీడీపీలో ప్రభుత్వ పథకాలతో పాటు నగరికి తాను చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరించాలని, గత ఎన్నికల్లో మీరు సరిగా పని చేయలేకపోవడం వల్లే నేను ఓటమి పాలయ్యానంటూ నగరి నాయకులు, కార్యకర్తలకు క్లాస్ పీకారు. గత ఎన్నికల సమయంలో ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రోజా చేతిలో ఓడిపోయానంటూ నిష్టూరమాడారు.అంతే కాదు తన సేవలను నాయకులు, కార్యకర్తలు గుర్తించకపోవడం నా దురదృష్టం అని వాపోయారు.. అయితే తన గురించి చంద్రబాబుకు బాగా తెలుసునని, ..నేను ఎవరిని లెక్కచేయనని..ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా..ఒక్క ఎన్టీఆర్ తప్ప ఆరుగురు సీఎంలను విమర్శించే..ఎన్నో సార్లు ఢీ అంటే ఢీ అని తొడగొట్టా…అందుకే తన సేవలను ఉపయోగించుకొనేందుకే గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చారని గాలి ముద్దుకృష్ణమనాయుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు 201 ఎన్నికల్లో గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రిని అయ్యేవాడినని అభిప్రాయపడ్డారు. పాపం గాలి గారికి ఇంకా మంత్రి పదవిపై మక్కువ పోలేదు.గత మంత్రి వర్గ విస్తరణలో తనకు స్థానం దక్కుతుదని ఆశపడ్డాడు..కానీ చంద్రబాబు గాలికి అవకాశం ఇవ్వలేదు..దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన నగరి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఓ దశలో నగరి ఎమ్మెల్యే రోజా గాలిని వైసీపీలోకి రమ్మని , వస్తే పార్టీలో సముచిత స్థానం జగన్ ఇస్తాడంటూ బహిరంగంగానే ఆఫర్ ఇచ్చింది. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గాలి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపాన్ని నగరి టీడీపీ నాయకులు, క్యాడర్‌పై చూపిస్తున్నాడు..మీరు గత ఎన్నికల్లో సరిగా పని చేస్తే నేను గెలిచేవాన్ని, అప్పుడే మంత్రి అయ్యేవాన్ని.నాకు పదవి రాకుండా చేసిందే మీరే అంటూ వారిపై చిందులు తొక్కుతున్నాడు..అయితే అసలు కారణం వేరు ఉంది..వచ్చే ఎన్నికల్లో గాలిని పక్కకు నెట్టి ఆయన స్థానంలో రోజాకు యాంటీగా మరో సినీ నటి వాణి విశ్వనాథ్‌ను నిలబెట్టాలని నగరి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు..అందులో భాగంగానే కొన్నాళ్ల క్రితం వాణివిశ్వనాథ్ నగరిలో పర్యటించి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించింది. తనకు వ్యతిరేకంగా వాణి విశ్వనాథ్‌ను పార్టీలోకి తీసుకువస్తున్న నగరి టీడీపీ నాయకులపై కోపాన్ని గాలిగారు ఇలా ఇన్‌డైరెక్ట్‌గా తీర్చుకున్నారని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.
