ఉండవల్లి కరకట్ట వద్దగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ఓ పోలీసు హల్ చల్ చేశాడు. పోలీస్ వ్యాన్‌ను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకు పోయాడు. దీంతో అదుపు తప్పిన ఓ బైక్ కింద పడిపోయింది. ఈ ఘటనలో వెంకటపాలెంకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రాణాపాయంనుంచి బయటపడ్డారు. అయితే, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
