రాష్ట్రంలో ఇప్పటికే 38 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలేనంటూ సీపీఐ నేత నారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 158 అనుమతులు లేని కాలేజీ హాస్టల్స్ ఉన్నా.. వాటిపై చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కళాశాల యాజమాన్య వ్యక్తులే కేబినెట్లో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఉచ్చులో చిక్కుకుందని, నీరజారెడ్డి కమిటీసిఫారసులను అమలు చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
