ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీ బుట్టారేణుక సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో చేరనుంది. ఈ క్రమంలో ఈ రోజు సీఎం నివాసానికి ఎంపీ బుట్టా రేణుక చేరుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మారడానికి బాబు వంద కోట్లు డబ్బులతో పాటుగా ఐదు వందల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టనున్నారు అని ఇటీవల ప్రముఖ న్యూస్ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెల్సిందే .
