వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు టీడీపీ సర్కార్ విముఖత చూపిస్తోంది. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు మొత్తం ఐదు రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అయితే వర్షాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా శీతాకాల సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాలపై అసెంబ్లీలో ఎక్కడ ప్రశ్నిస్తామోన్న భయంతో వర్షాకాల సమావేశాలు నిర్వహించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.