ఏపీ డీజీపీగా ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావునే కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే, డీజీపీ సాంబశివరావు డిసెంబర్లో రిటైర్డ్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, సాంబశివరావు పనితీరు, సామాజికవర్గ కోణంలో భాగంగా డీజీపీగా మళ్లీ నియమించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు డిసెంబర్లో జారీ చేయనుంది ప్రభుత్వం.
