రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింన హత్య కేసులో ఆర్టిసి విజిలెన్స్ డిఎస్పి రవిబాబు అరెస్టు అయ్యాడు. ఆయన చోడవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇటీవల గెదెల రాజు అనే రౌడీషీటర్ ను హత్య చేసిన ఘటనలోను, అలాగే మాజీ ఎమ్మెల్యే నూకరాజు కుమార్తె పద్మావతి హత్య కేసులో ను ఈయన నిందితుడుగా ఉన్నారు. పద్మావతితో సన్నిహిత సంబందాలు పెట్టుకున్న ఇతను ఆ తర్వాత ఆమెతో విబేధ పడి గొడవలు అవడంతో హత్య చేయించారన్నది అబియోగం. ఆ కేసులో గెదెల రరాజుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసుల కనుగొన్నారు. తదుపరి ఏభై లక్షల రూపాయల చెల్లించి,మిగిలిన డబ్బు కోసం గెదెల రాజు ఒత్తిడి తెస్తుండడంతో ఒక పాత్రికేయుడితో కలిసి అతనిని హత్య చేశారని వల్లడైంది. ఈవిషయాలను పోలీసులు దర్యాప్తులో కనుగొన్న తర్వాత రవిబాబు పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు అతను అరెస్టు అయ్యాడు. ఈయనతో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేశారు. అయితే వారి వివరాలు తెలియాల్సింది.
