జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధినేత పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. త్వరలోనే తుది నిర్ణయాన్ని పవన్ స్వయంగా వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకూ ఇంత సీరియస్‌గా జనసేన పార్టీ కోర్ కమిటీ భేటీ జరగలేదు. ఇలాంటి తరుణంలో ఆదివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ముఖ్య ప్రతినిధులతో పవన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వచ్చే 6 నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్య కార్యక్రమాలపై వపన్ చర్చించారు.
