వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 10:30 గంటలకు వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ కానుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిన విషయం విధితమే.
