వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. వేంపల్లి, పొద్దుటూరు రోడ్డులోని నేలతిమ్మాయపల్లి గ్రామం దగ్గర్లో మొదల కానున్న జగన్ పాదయాత్రలో భాగంగా.. మూడో రోజు యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి మొత్తం 16.2 కిలోమీటర్లు నడవనున్నారు. 12 ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, నేలతిమ్మాయపల్లి పలగిరి జంక్షన్ క్రాస్‌రోడ్డు దాటుకుని వీఎన్‌పల్లిలో సంగమేశ్వర ఆలయ ప్రధాన కూడలి వద్దకు చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు వైఎస్ జగన్. ఆ తరువాత సన్‌గాలపల్లి గ్రామం వరకు నడిచి మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం క్యాంప్ సైట్లోని విద్యార్థులు, ఉద్యోగులతో జగన్ భేటీ అవుతారు. పాదయాత్రను తిరిగి ప్రారంభించి గంగిరెడ్డిపల్లి, అయ్యవారిపల్లి మీదుగా ఉరుటూరు వరకు నడుస్తారు. ఉరుటూరు గ్రామంలోనే వైఎస్ జగన్ బస చేస్తారు. అలాగే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ గంగిరెడ్డిపల్లిలో సాయి ఆలయాన్ని సందర్శిస్తారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రెండో రోజు విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే.