ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా హుస్సైనపురంలో నిర్వహించనున్న మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. మంత్రుల స్థాయి నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాత్రికి రాత్రే మహిళా సదస్సును టీడీపీ నేతలు అనుమతి రద్దు చేయించారు. దీంతో సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకే మహిళా సదస్సును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహిళా సదస్సు కోసం డీఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నామని, అలాంటిది స్థానిక పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ కుట్రలు, కుతంత్రాలను అందరూ చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. అలాగే ఒక్క ఓటు అయిన మీకు వేస్తారా అని వైసీపీ నాయకులు అంటున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చూసి, టీడీపీ ఓర్వలేకపోతుందన్నారు.
మరోవైపు మహిళా సదస్సుకు వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమను సదస్సుకు ఎందుకు అనుమతించరంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే హుస్సైనపురం వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
కర్నూల్ జిల్లాలో రాత్రికి రాత్రే టీడీపీ నేతలు