ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ‘మహిళా గర్జన’ పేరిట వైసీపీ సోమవారం కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఓ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి ఎదురైంది. వారి ఇబ్బందిని గమనించి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు.
నిలబడిన మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ “చాలామంది అక్కచెల్లెళ్లు నిలబడే ఉన్నారు…. కుర్చీలు అయిపోయాయి…. పూర్తిగా నిండిపోయాయి…. మీకు సారీ అమ్మ అని అన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్ని అవస్థలు పడుతున్నాం? ఏ రకంగా మోసపోయామని బాధపడుతూ, ఇన్ని వేల మంది అక్కచెల్లెమ్మలు ఈ రోజు ఏకమై ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారని, ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్ అన్నారు.