ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు .
ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ ఆద్వర్యంలో దొమ్మేటి తన అనుచరులతో కలిసి వచ్చి పార్టీలో చేరారు.కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను వారు కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారని వారు అన్నారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ వన్ చేశారని ఈ సందర్భంగా వారు విమర్శించారు.