అధికారంలో ఉన్నామానే ధీమా…మేము ఏం చేసిన అడగరనే ధైర్యం ఇది ప్రస్తుతం ఏపీలో జరిగే పాలన. వయస్సుకు మర్యాద లేదు.. పదవికి మర్యాద లేదు… మరోపక్క టీడీపీకే ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వారికి గౌరవంలేదు. తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. వైసీపీలో నుండి టీడీపీ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చూపుతున్న ప్రేమ టీడీపీ నాయకులకు ఇవ్వడంలేదని తెలుస్తుంది. ప్రకాశంలో జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మేల్యే గొట్టిపాటి రవి గురించి సంగతి తెలిసిందే… కరణం బలరాం మాత్రం తన చిరకాల ప్రత్యర్థి గొట్టిపాటి రవితో సర్దుకు పోలేకపోతున్నారు. కాని చంద్రబాబు మాత్రం ఫిరాయించిన ఎమ్మేల్యేలతో సర్దుకు పోవాలని పదేపదే చెబుతున్నా… నిత్యం ఏదోక వివాదంతో ఈ ఇద్దరు నేతలు ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. ఈ ఘటనపై తాజాగా చంద్రాబాబు… కరణం ప్రవర్తనపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.. ఏపీలో ఏ నియోజకవర్గాలలో ఆ ఎమ్మెల్యేలు చేప్పిన పని చేయాలి ..మిగతా వారు అంటే ప్రజా పతినిధులైన, ఇతర నేతలైనా నియోజకవర్గాలలో వేలు పెట్టవద్దని మరోసారి స్పష్టం చేశారు. దాంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన కరణం బలరాం రెండు రోజుల క్రితం సచివాలయంలో జరిగిన ఒక సమావేశంలో మళ్లీ రెచ్చిపోయారు.
చివరకు…
ఇంకా మంత్రి లోకేశ్ కూడా కరణం బలరం వ్యవహారంపై తీవ్రమైన వాఖ్యలతో ఫైర్ అయినట్లు సమచారం. చివరికి లోకేష్ తో కూడా అనిపించుకోవడం ఏమిటని కరణం బలరం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు
