ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్, నాగులాపురం క్రాస్, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా యాత్ర కొనసాగనుంది. తరిమెలకు చేరుకున్నాక నేటి పాదయాత్ర అక్కడ ముగియనుంది.
జగన్ పై అభిమానం..
‘అన్నా ఆరోగ్యం జాగ్రత్త..ఎంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయినా జనం మీ వెంటే ఉన్నారు. బాబు పాలన పోవాలి…రాజన్న రాజ్యం రావాలి’…అంటూ పామిడి మండలం మిడుతూరుకు చెందిన యువకులు సురేశ్, వెంకటేశ్, శంకర్, పవన్, నారాయణస్వామి పెద్దవడుగూరు సమీపంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శించారు. మీ వెంటే మేమున్నామంటూ వారు జగన్‌ను కలసి తమ మనసులోని మాటను చెప్పారు.
