జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే జగన్ ముందు పవన్ ప్రస్తావన రాగా.. చాలా సింపుల్‌గా సమాధానం చెప్పారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ సీన్ లోకి వస్తారని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చంద్రబాబుకు ఎప్పుడు అవసరమో అప్పుడే పవన్ ప్రజల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుందన్నారు. చంద్రబాబును పవన్ విమర్శించరన్న జగన్, బాబు ప్రభావం నుంచి పవన్ బయటపడితే బాగుంటుందన్నారు. చంద్రబాబు చేసే మోసం, అవినీతి గురించి పవన్ తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాపై తనదీ, పవన్ దీ ఒకేమాట, ఒకే బాట అని కూడా చెప్పడం విశేషం. మరి పవన్ అండ్ కో ఎప్పుడు కళ్ళు తెరుస్తారో.. ఎప్పుడు ప్రశ్నిస్తారో చూడాలి.
