ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు సరియైన కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వారు చేసినప్పుడే ఆరోగ్యం సహకరించలేదా అని మండి పడుతున్నారు. అంతేగాక సోషల్ మీడియాలో టీడీపీ వారు ఏమైన చెయ్యవచ్చా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లి అత్యచారయత్నం జరిగితే వెళ్లారు…చిత్తూరు లో శోభనం రోజే పడక గదిలో భార్యను శాడిస్ట్ భర్త నరకం చూపిస్తే… అమ్మాయిని ఆసుపత్రికి వెళ్లి పరమార్శించి మీడియాతో మాట్లాడరు ..మరి దలిత మహిళపై వివస్త్రను చేసి దాడి చేస్తే మీరు ఇప్పటి వరకు స్పందించలేదే…కనీసం అడగలేదే… కాని మిమ్మల్ని ..ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం గుర్తుకు వస్తాదా ..ఇదేనా మీరు మహిళలకు మీరు చేసే న్యాయం అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. అంటే వారు టీడీపీ వారు అని నన్నపనేని రాజకూమరి వెనక్కి తగ్గుతున్నారా…లేక తెలుగు తమ్ముళ్లు ఏమైన చెయ్యవచ్చా అని మండి పడుతున్నారు.
