ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో ఓ హిజ్రా సజీవదహనం కలకలం రేపుతోంది. గాంధీనగరం వీధిలో ఉండే దేవుడమ్మ అనే హిజ్రాకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. దీంతో ఒంటరిగా ఉంటూ వెంకటేశ్వరస్వామి పూజలు చేసుకునే దేవుడమ్మ వద్దకు భక్తులు కూడా వచ్చేవారు. వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుంది. అలాంటి ఆ హిజ్రా తన ఇంట్లో మంటల్లో కాలిపోతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేలోపే దేవు డమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆమెకి షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు అంటోంటే, కొందరు దుండగులు సదరు హిజ్రాను హత్య చేసినట్లు మరికొందరు అనుమానిస్తున్నారు.
