జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే అర్హత ఉందట.. అంతేకాదు.. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడట. ఈ వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ నటుడు నవదీప్. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నవదీప్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. 2019లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్నకు నవదీప్ తడుముకోకుండా సమాధానం చెప్పాఉడ. 2019 ఎన్నికల్లో జనసేనాని తప్పకుండా సీఎం అవుతాడని, ఎంతటి వారినైనా ఢీకొట్టేలా పవన్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రజల సంక్షేమానికి పవన్ కల్యాణ్ అంకిత భావంతో, నిజాయితి పవన్‌కు ఎక్కువ అర్హతలు తెచ్చిపెట్టాయంటూ పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నటుడు నవదీప్.
