వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి విమర్శల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల ఓ మీడియా సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు జగన్ మోహన్‌రెడ్డికి ఓ బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. జగన్ తన అవినీతిని సొమ్మును, తన బ్లాక్ మనీని వైట్‌గా చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారన్నారు. ఎవరైనా.. ఒక సంవత్సరమంతా కష్టపడితే 10 శాతంకన్నా ఆదాయం రాదు.. అటువంటిది మీకు 2004 సంవత్సరంలో ప్రకటించిన మీ ఆస్తులకు ఓ 20 శాతం కలుపుకుని మిగతా ఆస్తిని ప్రభుత్వానికి దాఖలు చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిని ఈ అవకాశాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఉపయోగించుకుంటాడని తాను ఆశిస్తున్నట్లు వర్లరామయ్య వ్యంగ్యాస్ర్తాలు విసిరారు.
