ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకుంటున్న పాలనా రహిత నిర్ణయాలతో ఏపీలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు వివరించేందుకు.. అలాగే ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార ప్రణాళిక రూపొందించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం ఇలా ఈ మూడు జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజవంతంగా ముగించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాగాజా చిత్తూరు జిల్లాలో తన పాదయాత్రను ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై ఇప్పటికే పలు ప్రముఖ టీవీ ఛానెళ్లు, అలాగే, వివిధ రాజకీయ పార్టీలతోపాటు ఏపీ అధికార పార్టీ.. చంద్రబాబు సర్కార్ కూడా సర్వేలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలన్నింటిలోనూ ప్రజల్లో జగన్‌కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని, అలాగే, 2019 ఎన్నిలకలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌దే అధికారమని వెల్లడి కావడం గమనార్హం.
అంతేగాక, జగన్‌పై సర్వే రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో జరిగింది కూడా. అది కూడా .. ఏకంగా ప్రధాని మోడీ తన సెంట్రల్ ఇన్విస్టిగేషన్ ద్వారా పాదయాత్రపై సర్వే చేయించగా.. జగన్‌పై ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉందని, అలాగే, జగన్‌కు ప్రజల ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందని వెల్లడైందట. ఈ విషయాన్ని స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ విజయ సాయిరెడ్డితో అన్నట్లు సమాచారం. అయితే, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. అంతేగాక గుడ్ ఫాలోయింగ్ అంటూ జగన్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి.. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, అలాగే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ఆదుకున్నట్టు ఉంటుందని ప్రధాని మోడీని కోరగా.. అందుకు స్పందించిన ప్రధాని మోడీ సుముఖం వ్యక్తం చేశారని సమాచారం.