సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు కోడింపందేల జోరు.. బెట్టింగ్‌ల హోరు. ఇంకోవైపు రికార్డింగ్ డ్యాన్సులు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలతో పాటు రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించడం షరామామూలుగా జరిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. అర్ధరాత్రి దాటేసరికి ఇది కాస్తా అశ్లీల నృత్యాల మేళాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది.
మరో పక్క గ్రామ దేవత జాతర పేరుతో అమ్మాయిలు అర్థనగ్న డాన్సులు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో అమ్మవారి జాతర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక నృత్యకార్యక్రమాలను నిర్వహించారు. ఇందులోభాగంగా అమ్మాయిలతో అసభ్యకరీతిలో రికార్డింగ్ డాన్సులు కూడా వేయించారు. ఓ దశలో ఈ రికార్డింగ్ డాన్సులు హద్దులుదాటి.. అశ్లీల నృత్యాలుగా మారిపోయాయి. వంటిపై నూలుపోగు లేకుండా అమ్మాయిలు డాన్సులు వేస్తూ కుర్రకారును హుషారెత్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.