అనంతపురం జిల్లా టీడీపీ దివంగత మాజీ మంత్రి పరిటాల రవితో పాటు తనను కూడ చంపుతారనే సమాచారం తనకు ఆ సమయంలో ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించారు
తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పారు. అంతేగాక పరిటాల రవి సన్నిహితుడిగా ఉన్న తనను కూడ చంపేందుకు ప్లాన్ చేశారని వల్లభనేని చెప్పారు. పరిటాల రవి బతికున్న సమయంలో ఈ విషయాన్ని తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు. చనిపోవడానికి కొద్ది రోజుల మందు రవి ఈ విషయాన్ని చెప్పి జాగ్రత్తగా ఉండాలని సూచించాడని వంశీ చెప్పారు. పరిటాల రవిని చంపుతారని తెలుసునని వంశీ చెప్పారు. రవి చనిపోవడానికి నెల రోజుల ముందే ఈ విషయమై రవితో పాటు తమ మధ్య చర్చకు వచ్చిందని వంశీ చెప్పారు.
