అవును, మీరు చదివింది నిజమే. 2019 ఎన్నికల తరువాత మిగలబోయేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనంట. మిగతా పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చే భారీ మెజార్టీతో కొట్టుకు పోతాయట. ఈ మాటలన్నది ఎవరోకాదు. స్వయాన టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడే.
అయితే, ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా. జగన్ వైద్యుల సూచనల మేరకే పాదయాత్ర చేస్తున్నారని, ప్రజా సంకల్ప యాత్రను సైతం.. ముద్దుల యాత్రగా తయారు చేశారని ఎద్దేవ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.