వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల 29వ తేదీన వైయస్ జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఒక్కచోట సమావేశమై ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని మలేషియాప్రవాసాంధ్రుల ప్రార్ధిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న తిప్పరాజు రేవంత్, విజయ్ భాస్కర్, మహేష్ బాబు, విష్ణు, వాసు, కిరణ్ వైటిఎస్, హర్ష, మురళీదర్, ముకేశ్, సాంబ, కోటిలు పాల్గొన్నారు.
