ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయకులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యంగ్యంగా అన్నారు. దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు దావోస్ వెళ్లివచ్చి…ప్రతి ఒక్కరూ సూర్య ఆరాధన చేయాలని కొత్తగా చెప్పడం హాస్యాస్పదం.అని ఆయన అన్నారు.చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మానసిక స్థితి లోపించిందా?. లేక మైండ్ దావోస్‌లో ఏమైనా వదిలి వచ్చారా అనే అనుమానం కలుగుతోంది. దావోస్ మోజులో పడి గణతంత్ర వేడుకలకు కూడా హాజరు కాలేదు. ఈ దేశంలో గణతంత్ర వేడుకలకు హాజరు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?. అని రమేష్ ప్రశ్నించారు.ప్రస్తుతం ఈవాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
