జనసేన అదినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు చేస్తూ ముమ్మరంగా పర్యటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన ట్వీట్లు కొన్ని సోసల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, కత్తి మహేష్ తన ట్విట్టర్‌లో తంత్రంలేని సేన, యుద్ధంలేని సైన్యం, సమస్య ఇంకా సమసిపోలేదు, ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఏదో ఒకటి చేయొచ్చు, కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో మంతి మారొచ్చు అంటూ కత్తి మహేష్ పవన్ కల్యాణ్ జనసేనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పటి వరకు సర్దుమణిగిందనుకున్న పవన్ కల్యాన్, కత్తి మహేష్ యుద్ధం మళ్లీ మొదలైందిరో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
