శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలన్నారు. పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆక్షాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని వైఎస్ జగన్ అభిలషించారు.