వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఓ రేంజ్‌లో తిట్టాడు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తాను గెలిస్తే జగన్ రాజకీయాలు వదిలేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు జగన్‌నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు చంద్రబాబే సీఎం అని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ఆయనకే సవాలు విసుతున్నావ బి.కామ్ లో ఫిజిక్స్ అన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ అభిమానులు . ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికి తగిలేలా కామెంట్ల్ పెడుతున్నారు.
