ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కృష్ణా జిల్లా 84 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 77 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముందే చెప్పినట్లుగా ఈసారి రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేశామని మంత్రి గంటా తెలిపారు. మొత్తం 44 వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తదితరులు ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
