కలియగ దైవం వేంకటేశ్వర స్వామి పాలక మండలి నియామకంపై పెను దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నియమించిన ఛైర్మన్, సభ్యులపట్ల శ్రీనివాసుడి భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తుండగా.. మరో పక్క విపక్షాలు కూడా చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా, నేను విలువలు పాటించే మనిషిని, నిప్పు అంటూ చెప్పుకునే సీఎం చంద్రబాబు రోజుకో అనాలోచిత నిర్ణయం తీసుకుంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తిరుమలకు వైభవం రావడానికి గల కారణం నేనే అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఆ వేంకటేశ్వరస్వామి హుండీకే కన్నం వేసే పనిలోపడ్డారు. భారీగా నగదు దోచుకునేందుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగానే టీటీడీ మెంబర్‌లుగా తన పార్టీలోని అవినీతి రారాజులను నియమించారు. ఒకసారి టీటీడీ సభ్యులుగా చంద్రబాబు నియమించిన వారి జీవిత చరిత్రలు చూస్తే మీకే తెలుస్తుంది.. చంద్రబాబు ఎంత భారీ అవినీతికి తెర తీయబోతున్నారనే విషయం..!!
బోండా ఉమా : .. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే. అధికారాన్ని చూపెట్టి ఎదుటి వారిని దారిలో పెట్టుకోవడం బోండా ఉమా ప్రత్యేకత. రాజకీయాన్ని రౌడీయిజంగా మార్చుకుని దందాలు కొనసాగించడం బోండా ఉమా సొంతం. ఆయన్ను ఎవరైన ప్రభుత్వాధికారి లెక్కచేయలేదన్న తెలిసిన మరుసటి రోజే.. ఆ అధికారిపై బదిలీ వేటు తప్పదు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి.. భూ భాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ కబ్జా చేసిన భూములను తన బంధువుల పేరిట, తన భార్య పేరిట రిజిస్ర్టేషన్ చేయించడం ఎమ్మెల్యే బోండాకు వెన్నతోపెట్టిన విద్య. అందులో భాగంగా వెలుగులో చూసిన సంఘటనే విజయవాడ మధురానగర్‌లోని స్వాతంత్ర్య సమర యోధుడికి సంబంధించిన భూ కబ్జా. అంతేకాక, మీకు ప్రభుత్వం తరుపున ఇళ్లు కట్టుకునేందుకు భూములు ఇప్పిస్తానంటూ.. సుమారు 230 మంది ప్రజల నుంచి కోట్లు దండుకుని.. తీరా స్థలాలు మంజూరు కాలేదంటూ చేతులెత్తేశారు బోండా ఉమా. అలా మోస పోయిన వారు ఎమ్మెల్యే బోండాపై ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.
ఎమ్మెల్యే అనిత : పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే. నేను, ఉదయం నిద్దర లేచినప్పట్నుంచి.. మళ్లీ సాయంత్రం నిద్దర పోయేంత వరకు క్రిస్టియన్ల పవిత్ర గ్రంథాన్ని చదువుతానని చెప్పుకొచ్చింది. అసలు బైబిల్ లేనిదో తనకు రోజు గడిచినట్టు ఉండదని, ప్రతీ ఆదివారం ఏ పరిస్థితిలో ఉన్నా చర్చికి వెళతానని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే అనిత చెప్పుకొచ్చింది. అనిత చెప్పిన ఆ మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, హిందువులు పవిత్రంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధానం తిరుమల తిరుపతి దేవస్థానంకు క్రిస్టియన్ అయిన ఎమ్మెల్యే అనితను నియమించడంతో చంద్రబాబు సర్కార్‌ఫై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయపాటి సాంబశివరావు : నరసారావుపేట ఎంపీ. ఇప్పటికే ఎంపీ రాయపాటి సాంబశివరావుపై దేశంలోని ఏ ఎంపీపై లేనన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంపీ సాంబశివరావుకు సంబంధించిన కంపెనీ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ.
అంతేకాక, బీఏపీతో కటీఫ్ చెప్పేశామని మీడియా సాక్షిగా చెప్పిన సీఎం చంద్రబాబు.. మళ్లీ అదే పార్టీకి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సతీమణి స్వప్నకు టీటీడీ మెంబర్‌గా నియమించారు.
హిందువులు పవిత్ర స్థలంగా భావించే.. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా సీఎం చంద్రబాబు తన కుఠిల రాజకీయాలతో అపవిత్రం చేస్తున్నారని, అంతేకాకుండా, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీకే కన్నం వేసేందుకు తన అనుచర వర్గాన్ని టీటీడీ పాలక వర్గంలో నియమించారంటూ భక్తులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.