Home / ANDHRAPRADESH / పరిటాల సునీత ఇంట్లో మ‌రో పెళ్లి సందడి…!

పరిటాల సునీత ఇంట్లో మ‌రో పెళ్లి సందడి…!

పరిటాల వారింట మరోమారు పెళ్లి సందడి నెలకొంది. పరిటాల రవి, సునీతల కుమార్తె డాక్టర్ స్నేహలత వివాహం నేడు జరగనుండగా, ఇప్పటికే వధువును పెళ్లి కుమార్తెను చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ హాజరై, వధువును ఆశీర్వదించారు. ఆమె వివాహం శ్రీహర్షతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇక ఈ పెళ్లికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు నలుగురు డీఎస్పీలు, తొమ్మిది మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, 300 మందికి పైగా కానిస్టేబుళ్లను, స్పెషల్ పార్టీ, రోప్ పార్టీలను నియనించారు. వెంకటాపురంలోని కల్యాణమండపం వద్ద ఆహూతులకు అందించేందుకు నీరు, మజ్జిగలను సిద్ధం చేశారు. పరిటాల శ్రీరామ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.