ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది.
జిల్లాలోని డోన్ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. గురువారం తన ఇంట్లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఓ వ్యక్తికి వైద్యం చేయాలని ఆటోలో తీసుకెళ్లారు. వారితో వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డి పొద్దుపోయే వరకూ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం డోన్ సమీపంలోని ఉడుములపాడు ఇండోర్ స్టేడియం సమీపంలో శవమై కనిపించటంతో వారి రోదనలు మిన్నంటాయి. ఆటోలో తీసుకువెళ్లిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్పీ బాబా ఫకృద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వైద్యుడి తండ్రి పోచ ప్రభాకర్‌రెడ్డి కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆయన స్థానిక టీడీపీ నాయకుడిగా ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.