విశాఖ నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తనను పొగిడారని, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మనం దూరమయ్యాకే ఆయన విమర్శలు సాగిస్తున్నారని చెప్పారు. మొన్న పొగిడి ఇప్పుడు తిట్టడానికి పవన్ కారణం చెప్పాలన్నారు. అంతేకాదు తన చేతికి వాచీ లేదని, ఉంగరం లేదని, జేబులో డబ్బులు లేవని, తానెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదని, మందుకొట్టలేదని, సిగరేట్ కాల్చలేదని, చెడు స్నేహాలు చేయలేని, అలాంటి నన్ను తిడుతుంటే రాష్ట్ర ప్రజల కోసం భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అయితే ఈ వాఖ్యలు పవన్ కల్యాణ్ గురించేనా..అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది.
