ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న శ్రీరెడ్డి.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు.
దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..!
ఎవరికి తెలియదు?: ‘‘నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, అక్కడ పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఓర్పుగా ఉండటం సినిమా డైలాగ్స్ కొట్టి నీళ్లు తాగినంత సులువు కాదు. మీ అన్న రాజకీయాలు, సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియదు?’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు.