టాలీవుడ్ హీరో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెక్కిరించారనేది ఆశ్చర్యం కలిగించే విషయమే.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తిప్పి కొట్టే అంశంలో ప్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా అది ఓ వ్యక్తి పేరు అని పవన్ అనుకుంటున్నారని లోకేష్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి భూములు కేటాయిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించినట్టు లోకేష్ చెప్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేశ్ వ్యాఖ్యానించారు. అటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 450 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడింది చెప్పి 2,500 ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వబోతోందని చెప్పారు. నిజంగానే ఫ్రాంక్లిన్ టెంప్లేటోన్ కంపెనీ గురించి పవన్ కి అవగాహన లేదా? అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.
