ప్రముఖ నటి , వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందని నేపద్యంలో ఆమె సొంతగా వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆమె ఈ విషయం చెప్పారు.నగరి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని రోజా చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె అన్నారు. అందువల్ల వారి కోసం సహాయ కార్యక్రమాలను తానే చేపడుతున్నానన్నారు. 10మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు ఇచ్చామని, నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్ కాలేజీలో ఆర్‌వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
