ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తరువాత అంతటి దమ్ము , ధైర్యంగా మాట్లాడే మగాడిగా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.నెల్లూరు నగరంలో తనను ఓడించే మగాడు , మొనగాడు ఇంకా పుట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనిల్ కుమార్ దమ్మున్న నాయకుడు అని నిరూపించుకున్నాడు..తాజాగా మళ్లీఅలాంటి వాఖ్యలు చేసి హీరో అయ్యాడు. ‘భయం అంటే నాకు తెలియదు. అది నా రక్తంలోనే లేదు’అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రజాదీవెనలో భాగంగా ఆయన నక్కలోళ్ల సెంటర్, బృందావనం ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారన్న భయంతోనే ఆయనపై తాను విమర్శలు చేస్తున్నానని శ్రీధర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా నారాయణ విద్యా సంస్థల ద్వారా మంత్రి విద్యార్థుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. ఇందుకు ప్రభుత్వ జీవోనే సాక్ష్యం అన్నారు. నాలుగేళ్లుగా మంత్రికి ముంగమూరు భజన చేస్తూ కోట్లాది రూపాయల కాంట్రాక్టు పనులు సంపాదించుకున్నారని ఆరోపించారు.
