ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు,ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించారని, ఆయన ఆశయసాధనే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు.ప్రజలు పాలన చేయమని అధికారం కట్టబెడితే ఇతర పార్టీలపై నిందలు వేయడానికే తెలుగుదే శం పార్టీకి సరిపోతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధాని చాలెంజ్‌గా తీసుకోవాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.అధిష్టానం ఏ పని అప్పగిస్తే అది చేస్తానని, ప్రస్తుతం జిల్లాలో వైసీపీ బలోపేతంగా ఉందన్నారు. మరింత తమవంతుగా బలో పేతం చేసే దిశగా కృషి చేస్తానని నేదురుమల్లి అభిమానులను ముందుర అన్నారు.
