మూడు రోజుల క్రితం టీడీపీ నేతల ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. వైయస్‌ఆర్‌సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని వైయస్‌ఆర్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. అర్థరాత్రి 12 గంటల వరకు హౌస్ అరెస్టులు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చిందన్నారు.
చట్టబద్ధంంగా అనుమతి కోరితే తిరస్కరించారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకు వస్తాయని యరపతినేనికి భయం పట్టుకుందన్నారు. 2009లో చనిపోయిన రైతుపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారని, ఇల్లు, పొలం కూడా లేని వ్యక్తి రూ.80 కోట్ల స్కాం చేస్తాడా అని నిలదీశారు. అమాయకులపై కేసులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.