ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలను ఎవరో ఒకరి మీద నెట్టాలని ఆలోచించి,బీజేపీ అయితే ఉపయోగపడవచ్చని భావించి ,బీజేపీతో బందం తంచుకున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక పత్రిక జగన్ ను చంద్రబాబు ఎందుకు బిజెపితో బందం తెంచుకున్నారని ప్రశ్నించింగా జగన్ సమాదానం ఇచ్చారు.తన వైఫల్యాలకు ఎవరో ఒకరిని బాద్యుడిని చేయాలని భావించి ఆ పని చేశారని అన్నారు.నిజానికి 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు బీజేపీ,కేంద్రం బాగా సాయం చేస్తోందని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నారని చెప్పారు.తాము వ్యతిరేకించినా, అసెంబ్లీలో అందుకు కేంద్రానికి దన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారన ఆయన వివరించారు. ఆ తర్వాత ప్రజలలో తనపై ఉన్న వ్యతిరేకతను గుర్తించి , దానిని బీజేపీపై నెట్టి బయటపడాలని భావించి ఆ పార్టీతో బందం తెంచుకున్నారని ఆయన అన్నారు. దీనిని ప్రజలంతా గమనించారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
