కర్నూల్ నగరంలో 25వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్మపోరాట దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు తెలిపారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్ల్లను వారు ఆదివారం పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా ధర్మపోరాట దీక్షను భారీ ఎత్తున లక్ష మంది ప్రజలతో నిర్వహించేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామని, విభజన చట్టంలో హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ఈ ధర్మపోరాట దీక్ష ఉంటుందన్నారు. అయితే ప్రజాదనం మరో 100 కోట్లు వృదా అంటున్నారు . నాలుగేళ్ళలో వేల కోట్లకు పైగా ప్రజాదనం హంగులు, ఆర్బాటాలకోసం ఖర్చుపెట్టారని వైసీపీ నేతలు అంటున్నారు.
