ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ కు రుణానికి, గ్రాంట్ కు తేడా తెలియదా అని కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బాండ్లకు రెండువేల కోట్ల రూపాయల మొత్తం వసూలైందని సంబరపడుతూ లోకేష్ చేసిన ట్వీట్ గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్రం రాజదానికి 1500 కోట్ల నిదులు ఇస్తే తాము బాండ్ల ద్వారా 2వేల కోట్లు సాదించామని అన్నారని ఎమ్మెల్యే వివరించారు. బాండ్లు అన్నవి అప్పు, వాటిని వడ్డీతో సహా తీర్చాలన్న సంగతి అమెరికా యూనివర్శిటీలో చదివి వచ్చానని చెప్పే లోకేష్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.కేంద్రం నుంచి వచ్చేది గ్రాంట్ అని,దానిని తీర్చేపని ఉండదని బుగ్గన అన్నారు.ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆయన లోకేష్ ను ప్రశ్నించారు.
