తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున వికాస వారి జాబ్ మేళ నిరుద్యోగులకు శాపంగా మారింది.ఈ వికాస టీం గడిచిన 8నెలలుగా జిల్లా లోని పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, రాజమహేంద్రవరం, పటవల, అమలాపురం,అనపర్తి నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేల అద్వర్యంలో జాబ్ మేళ లు నిర్వహించారు. ఐతే ఇందులో కొంతమంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది..కానీ ఇప్పటికి జాయినింగ్ లెటర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. జాబ్ మేళ కి వచ్చిన కంపెనీలలో ‘AVISERV AIRPORT INDIA PVT LTD’ కూడా వచ్చింది. దీనికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వ్యక్తి అమలాపురం కి చెందిన “నిమ్మన రాము”.ఇతను ప్రతి నియోజకవర్గానికి 30మందికి పైగా సెలెక్ట్ చేసారు.సెలెక్ట్ అయిన మరుక్షణమే వికాస టీం తాత్కాలికి జాయినింగ్ లెటర్ ఇప్పించారు.
అయితే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని 10000/- రూపాయలను కట్టమనగా వికాసా హెడ్ ని సంప్రదించి 200 మంది పైగా సెలెక్ట్ అయినవారు ఆ డబ్బును కట్టేసారు. కానీ ఆ డబ్బు మొత్తం తీసుకోని జాబ్ లు ఇవ్వకుండా మోసం చేసారు . ఈమేరకు వికాసాని ఆశ్రయించగా వాళ్ళు ఆ మోసగాడిని పట్టుకుంటామని కాలం గడిపేస్తునారు. అయితే ఆ సంస్థకు ముందుగానే తెలిసే వాడిని తీసుకువచ్చారని సమాచారం. కొంతమంది యువకులు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రని ఆశ్రయించగా ఆయన కూడా పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనితో యువకులు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అధికారపార్టీ నాయకుల వత్తిడి వల్ల ఏమీ చేయలేమని చెప్పేసారు. నాయకులు,కలెక్టర్ ఆ సంస్థకు కు అండగా ఉంటూ యువకుల భవిష్యత్ నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధిత యువకులు లబోదిబోమంటున్నారు. నాయకులు పట్టించుకోక, అధికారులు చర్యలు తీసుకోకపోగా, మీడియా ఈ అంశాలను చూపించకపోవడంతో అందరూ సోషల్ మీడియాలో తమ సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఆ ప్రాంత నాయకులు పరిస్థితిని అర్ధం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.