కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పేదలకు పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాని చేపట్టామని తెలియజేసారు.ఇక్కడే కాకుండా రాష్ట్రమంతట ఆయనకు నివాళులర్పించారని చెప్పారు.